Indian Railways: మీ టికెట్‌పై మరొకరు ప్రయాణం.. ఈ విధంగా

టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నా అర్జంట్ పని ఉండి ఆగిపోవాల్సి వస్తుంది ఒక్కోసారి.

Update: 2021-08-23 11:23 GMT

Indian Railways: వ్యక్తిగత కారణాల వల్ల టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నా అర్జంట్ పని ఉండి ఆగిపోవాల్సి వస్తుంది ఒక్కోసారి. ఏవో పలు కారణాలతో మీరు ప్రయాణం చేయలేకపోతే అవసరమైన ఎవరికైనా తమ టిక్కెట్‌లను బదిలీ చేసుకునే వెసులుబాటుకు భారతీయ రైల్వే అనుమతించింది.

అవసరం ఉన్న ఎవరికైనా మీ టికెట్ ఇవ్వవచ్చు. ముఖ్యంగా, ఇది పాత వార్తే అయినా కానీ దీని గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు. కన్ఫామ్ అయిన టిక్కెట్లను తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, కుమార్తె, కుమారుడు సహా అతని కుటుంబ సభ్యులకు ప్రయాణీకుడు బదిలీ చేయవచ్చు.

అయితే ఇందుకోసం రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు మీ అభ్యర్థనను రైల్వే అధికారులకు తెలియజేయాలి. మీ అభ్యర్థనను వారు స్వీకరించిన తర్వాత, టికెట్‌పై మీ పేరు తొలగించి బదిలీ చేయబడిన వ్యక్తి పేరు ఉపయోగించబడుతుంది.

వివాహాలకు వెళ్లే వ్యక్తుల విషయంలో అన్ని పత్రాలతో 48 గంటల ముందు అభ్యర్థనను రూపొందించాలి. ఇది NCC క్యాడెట్లకు కూడా అందుబాటులో ఉంది. మీరు ఆన్‌లైన్‌లో ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

భారతీయ రైల్వేల ప్రకారం, ఈ బదిలీ సౌకర్యం ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడుతుంది. దీని అర్థం, ఒక ప్రయాణికుడు తన టిక్కెట్లను ఎవరికైనా బదిలీ చేసినట్లయితే, ఇక దానిని మార్చలేడు. టిక్కెట్‌ను మరొకరికి బదిలీ చేయడం సాధ్యం కాదు. 

మీ టికెట్‌ను వేరొకరికి బదిలీ చేయడానికి దశలు:

దశ 1: మీ ధృవీకరించబడిన టికెట్ హార్డ్ కాపీని పొందాలి. (ప్రింట్‌ అవుట్)

దశ 2: సమీప రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ని సందర్శించాలి.

దశ 3: ID రుజువు ఎవరి పేరు మీద టికెట్ బదిలీ చేయబడాలో వారిది తప్పక తీసుకెళ్లాలి.

ఇందుకోసం ఆధార్ లేదా ఓటర్ ID సరిపోతుంది.

దశ 4: ఇప్పుడు, మీరు కౌంటర్ ద్వారా టికెట్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags:    

Similar News