ఇండోనేషియాలో సముద్రంలో కూలిన విమానం

జకార్తా నుంచి పాంటియానక్‌కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన 4 నిమిషాలకే విమానం ఆచూకీ గల్లంతయింది. థౌజండ్‌ ఐలండ్‌ ప్రాంతంలో విమానం కూలినట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

Update: 2021-01-09 15:21 GMT

ఇండోనేషియాలో అదృశ్యమైన విమానం సముద్రంలో కుప్పకూలి ఉంటుందని ఆ దేశ రవాణాశాఖ స్పష్టంచేసింది. జకార్తా నుంచి పాంటియానక్‌కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన 4 నిమిషాలకే విమానం ఆచూకీ గల్లంతయింది. థౌజండ్‌ ఐలండ్‌ ప్రాంతంలో విమానం కూలినట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం రాడార్ సమాచారాన్ని విశ్లేశించిన అధికారులు సముద్రంలో పడిపోయి ఉంటుందని ప్రకటించారు.

ఇండోనేషియాలోని జకార్తా నుంచి పాంటియానక్‌ వెళ్తున్న విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి బయల్దేరిన ఎయిర్‌ బోయింగ్‌ 737 శ్రీవిజయ విమానం టేకాఫ్‌ అయిన 4 నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 55 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది కలిపి మొత్తం 61మంది ఉన్నట్టు ఆ దేశ రవాణాశాఖ మంత్రి తెలిపారు. ప్రయాణికుల్లో నలుగురు చిన్నారులు, ఓ శిశువు కూడా ఉన్నట్టు చెప్పారు.

Tags:    

Similar News