IIT Kanpur: తండ్రి బంకులో ఉద్యోగం.. కూతురు ఐఐటీ కాన్పూర్‌లో ఇంజనీర్..
IIT Kanpur: ఎంత మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు అయినా.. కాంప్రమైజ్ కాకుండా తమ పిల్లలకు అందించాలి అనుకునేది చదువు ఒక్కటే.;
IIT Kanpur: ఎంత మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు అయినా.. ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తమ పిల్లలకు అందించాలి అనుకునేది చదువు ఒక్కటే. ఎంత కోరుకున్నా తమ వరకు రాని చదువును తమ పిల్లలకు సులువుగా అందించాలి అన్నదే తల్లిదండ్రుల ఆశ. అలా కష్టపడుతున్న వారి కష్టాన్ని గుర్తించి కొందరు పిల్లలు తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తారు. అలాంటి ఒక అమ్మాయే ఆర్య.
కేరళలోని పయ్యనూర్‌కు చెందిన రాజ్‌గోపాల్ గత 20 ఏళ్లుగా పెట్రోల్ బంకులోనే పనిచేస్తున్నాడు. ఆ జీతంతోనే తన ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. చాలిచాలని జీతమయినా కూడా రాజ్‌గోపాల్ తన కూతురు ఆర్యకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేలా చూసుకున్నాడు. చిన్నప్పటి నుండి తండ్రి కష్టాన్ని, తమ స్థోమతను దృష్టిలో పెట్టుకొని చదువుకున్న ఆర్య ఈరోజు తన తండ్రి గర్వపడే స్థాయికి ఎదిగింది.
ఎంతోమంది కలలు కనే ఐఐటీ కాన్పూర్‌లో సీట్ సాధించింది ఆర్య. పెట్రోలియం టెక్నాలజీలో అడ్మిషన్ తెచ్చుకుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన అందరూ ఆర్యను ప్రశంసలతో ముంచేస్తున్నారు.