Omicron Variant: కరోనా ఒమ్రికాన్ వేరియంట్‌పై మహారాష్ట్ర తీసుకుంటున్న జాగ్రత్తలివే..
Omicron Variant: చైనాలో పుట్టి మొత్తం ప్రపంచాన్నే వణికించింది కరోనా వైరస్.;
Omicron Variant: చైనాలో పుట్టి మొత్తం ప్రపంచాన్నే వణికిస్తోంది కరోనా వైరస్. అంతే కాదు అసలు జీవితాలు ఇంత దారుణంగా ఉంటాయా అని బాధపడేలా చేసింది. అదే విధంగా సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఒమ్రికాన్ వేరియంట్ కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే ఒమ్రికాన్ వేరియంట్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి.
కరోనా అనేది మనం ఎప్పుడు ఊహించని ఒక మహమ్మారి. ఆ సమయంలో దానికి ఎవరు ఎలా స్పందించాలో అర్థం కాక కొన్ని నిర్ణయాల వల్ల మనుషుల ప్రాణాలే పోయాయి. అందుకే ఈసారి ప్రజలు మాత్రమే కాదు ప్రభుత్వం కూడా ఒమ్రికాన్ వేరియంట్‌ను తమ వరకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర ఓ అడుగు ముందే వేసింది.
ఇతర రాష్ట్రాలు, దేశాలు నుండి వచ్చే ప్రయాణికులపై అప్పుడే మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతోంది. ఇతర ప్రాంతాల నుండి మహారాష్ట్రకు వెళ్లాలి అంటే వారు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయించుకుని ఉండాలి. లేదా 72 గంటల ముందుగా కోవిడ్ టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్ అయినా వారితో పాటు ఉండాలి. త్వరలోనే ఈ ఆంక్షలు ప్రతీ రాష్ట్రంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో చేసిన తప్పులను మరోసారి రిపీట్ చేయకూడదు అనుకుంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.