Navneet Kaur : ఉద్దవ్ ఠాక్రే కుర్చీ కోసం ఎంతకైనా దిగజారుతారు : నవనీత్ కౌర్
Navneet Kaur : రాజద్రోహం కేసులపై, సెక్షన్ 124ఏ అమలుపై సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పును మహారాష్ట్ర ఎంపీ నవ్‌నీత్ కౌర్ స్వాగతించారు.;
Navneet Kaur : రాజద్రోహం కేసులపై, సెక్షన్ 124ఏ అమలుపై సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పును మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ స్వాగతించారు. ఎపుడో బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర్య సమరయోధులపై కేసులు పెట్టడానికి తీసుకువచ్చిన సెక్షన్ 124ఏ ను ఇప్పటికీ కొనసాగించడం, దేశ హితం కోసం మాట్లాడేవారిపై ప్రభుత్వాలు రాజద్రోహం కేసులు పెట్టడాన్ని నవ్‌నీత్ కౌర్ తప్పుపట్టారు. 124ఏ సెక్షన్‌ను ఎత్తివేయడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని కితాబిచ్చారు. అలాగే సీఎం ఉద్దవ్ ఠాక్రే కుర్చీ కోసం ఎంతవరకైనా దిగజారుతోరో ఇప్పటికే రుజువైందని మండిపడ్డారు. ఉద్దవ్ ఇంకా కిందపడుతున్నారని విమర్శించారు.