గత 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా కేసులు, మరణాలు..

Corona Update: గత 24 గంటల్లో భారతదేశం 38,792 కొత్త కరోనావైరస్ కేసులతో పాటు 624 మరణాలను నమోదు చేసింది.

Update: 2021-07-14 05:19 GMT

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

Corona Update: గత 24 గంటల్లో భారతదేశం 38,792 కొత్త కరోనావైరస్ కేసులతో పాటు 624 మరణాలను నమోదు చేసింది. బుధవారం ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో ఈ గణాంకాలను పొందుపరిచారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 3.1 కోట్లు దాటింది. అయితే మరణాల సంఖ్య ఇప్పుడు 4.11 లక్షలకు మించిపోయింది. కేరళలో కొత్తగా 14,539 కేసులు నమోదయ్యాయి. గత ఆరు రోజులలో ఇది అత్యధికం. కాగా మహారాష్ట్ర 7,243 కొత్త కేసులు నమోదయ్యాయి.

భారతదేశంలో మొట్టమొదటిగా కోవిడ్ -19 కేసు నమోదైన కేరళ త్రిస్సూర్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువకుడికి మళ్లీ వైరస్ పాజిటివ్ వచ్చింది. చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థి అయిన మహిళకు టీకా ఇంకా అందిచలేదని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడం పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదిలావుండగా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) మరియు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్) మంగళవారం భారతదేశంలో స్పుత్నిక్ వి కరోనావైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తిని సెప్టెంబర్ నుండి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారతదేశంలో సంవత్సరానికి 300 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలని పార్టీలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News