చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య సేవలు మెరుగుపరచే అంశంపై కేంద్రం ఫోకస్ చేసింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు.;
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య సేవలు మెరుగుపరచే అంశంపై కేంద్రం ఫోకస్ చేసింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌పోర్స్ విభాగాల్లోని మెడికల్ అధికారులంతా ఆస్పత్రుల్లో పనిచేసే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.. రక్షణ శాఖ ఆస్పత్రులన్నిటిలోనూ డాక్టర్లకు సాయం కోసం అదనపు నర్సింగ్ అధికారుల నియామకాలు చేపట్టినట్లుగా ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు బిపిన్ రావత్.
అలాగే దేశంలోని వివిధ రక్షణ శాఖ విభాగాల్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లన్నీ ఆస్పత్రులకు తరలించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అవకాశం ఉన్న ప్రతిచోటా పౌరుల కోసం పెద్ద ఎత్తున రక్షణ శాఖ ఆధ్వర్యంలో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమ మిలటరీ మెడికల్ వసతులు ఆస్పత్రులకు అందించేందుకు రక్షణ శాఖ ముందుకొచ్చింది. గత రెండేళ్లోల రక్షణ శాఖ నుంచి రిటైరైన వైద్య సిబ్బంది మొత్తాన్ని వారి నివాస ప్రాంతానికి సమీపంలోని ఆస్పత్రిలో పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది కేంద్రం.
అలాగే విదేశాల నుంచి ఆక్సిజన్, ఇతర అత్యవసర సామగ్రి తరలింపు, భారత వాయుసేన చేపట్టిన కార్యక్రమాలను ప్రధాని మోదీ సమీక్షించారు.