70 ఏళ్లలో కూడగట్టిన ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు: రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు.

Update: 2021-08-24 15:45 GMT

Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. గత 70 ఏళ్లలో ఏమీ జరగలేదంటూనే ఆ సమయంలో సృష్టించిన ఆస్తులన్నీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోందంటూ విమర్శలు చేశారు. కొద్ది మందికి వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చాలనే ప్రయత్నాల్లో భాగమే ఆస్తుల అమ్మకమంటూ ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని, హేతుబద్ధత లేని ప్రైవేటీకరణ మంచిది కాదని రాహుల్‌ గాంధీ హితవు పలికారు.

Tags:    

Similar News