ఘోర రోడ్డు ప్రమాదం.. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన ట్రక్.. 13 మంది కూలీలు మృతి
ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 13 మంది అక్కడికక్కడే మరణించారు.;
గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న వారిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 13 మంది మరణించగా... మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన తెల్లవారుజాము సమయంలో జరిగింది.
సూరత్ సమీపంలోని కిమ్ చార్ రాస్తా వద్ద ఫుట్ పాత్ పై 18 మంది నిద్రిస్తున్నారు. వేగంగా వచ్చిన ట్రాక్టర్.. మరో ట్రక్కును ఢీకొట్టడంతో డ్రైవరు నియంత్రణ కోల్పోయి.. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 13 మంది అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కూలీలని పోలీసులు చెప్పారు.