Tata Steel : హ్యాట్సాఫ్ : కరోనాతో ఉద్యోగి మరణిస్తే... కుటుంబానికి జీతం.. !
Tata Steel : టాటా స్టీల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపధ్యంలో తమ సంస్థలోని ఉద్యోగులు ఎవరైనా కరోనాతో మరణించినట్లయితే వారి కుటుంబాలకి అండగా నిలబడతామని పేర్కొంది.;
Tata Steel : టాటా స్టీల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపధ్యంలో తమ సంస్థలోని ఉద్యోగులు ఎవరైనా కరోనాతో మరణించినట్లయితే వారి కుటుంబాలకి అండగా నిలబడతామని పేర్కొంది. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ద్వారా వారికి ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది.
" టాటా స్టీల్.. ఒకవేళ మా సంస్థలో పనిచేసే ఉద్యోగి కరోనాతో మరణిస్తే... సదరు కుటుంబానికి ఆ ఉద్యోగి మరణించిన నాటికి ఎంత మొత్తమైతే వేతనంగా పొందుతున్నారో అంత మొత్తాన్ని ఆ కుటుంబానికి అందజేస్తాం... ఇది ఆ ఉద్యోగికి 60 సంవత్సరాలు నిండేవరకు అందజేస్తాం. అంతేకాకుండా వైద్య, గృహపరమైన లబ్దిపొందేలా చూసుకుంటాం" అని పేర్కొంది.
ఇక కరోనా సోకి ఒకవేళ విధుల్లో భాగంగా చనిపోతే పూర్తి స్థాయి వేతనంతో పాటుగా సదరు ఉద్యోగి పిల్లలు గ్రాడ్యుయేషన్(ఇండియాలో) పూర్తి చేసేంత వరకు ఖర్చులన్నీ కూడా తామే భరిస్తామని పేర్కొంది. ఈ నేపధ్యంలో టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా దాతృత్వానికి నెటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా అటు కరోనా మొదటిదశలో రతన్ టాటా కరోనా కట్టడికి 1500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.!