Srivari Brahmotsavam: ఘనంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

Srivari Brahmotsavam: ఐదో రోజు మలయప్ప స్వామి మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Update: 2022-10-01 06:47 GMT

Tirumala Brahmostavalu: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఐదో రోజు మలయప్ప స్వామి మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి గరుడ వాహనంలో స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు.

గరుడ సేవకు దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు భారీ ఏర్పాట్లు చేశారు. గ్యాలరీల్లో ఉద‌యం నుంచే అన్నప్రసాదం, తాగునీరు అందిస్తున్నారు.

ఇక అన్నప్రసాద భ‌వ‌నంలో రాత్రి ఒంటి గంట వ‌రకు భోజనం అదించేలా ఏర్పాట్లు చేశారు. అటు గ‌రుడ సేవ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు కావాల్సిన స‌మాచారాన్ని అందించేందుకు ఏడు ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్‌లు టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు సులువుగా మాడ వీధుల్లోని గ్యాల‌రీల్లోకి ప్రవేశించేందుకు వీలుగా సైన్‌బోర్డులు ఏర్పాటు చేశారు.

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఐదో రోజు మాడవీధుల్లో మలయప్ప స్వామి మోహినీ అవతారంలో దర్శనమిస్తున్నారు. అటు కళాకారుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాల ప్రదర్శనలు మైమరపించాయి.

విజయవాడకు చెందిన దుర్గాభవాని కోలాట భజనమండలి ప్రదర్శన... భక్తులను మంత్రముగ్దుల్ని చేసింది.. సంప్రదాయ చీరకట్టుతో అరచేతిలో దీపాలు పట్టుకొని చేసిన నృత్యప్రదర్శ చూపర్లను కట్టిపడేసింది.స్వామివారి ముంగిట కోలాటమాడే అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నట్లు కళాకారిణి ఉషా అంటున్నారు

Tags:    

Similar News