Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో కీలక పరిణామం..
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.;
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని బరిలో ఉన్న భారత సంతతి నేత రిషి సునాక్ మొదట్లో జోరు కనబర్చినా, ఆ తర్వాత లిజ్ ట్రస్ ధాటికి వెనుకబడ్డారు. అయితే, ఓ టీవీ చర్చ కార్యక్రమంలో లిజ్ ట్రస్‌పై సునాక్ ఆశ్చర్యకర విజయం సాధించారు.
స్కై న్యూస్ చానల్ నిర్వహించిన డిబేట్‌లో ఆడియన్స్‌లో అత్యధికులు కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ నాయకత్వాన్ని బలపరిచారు. ఆ చానల్ డిబేట్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ పాడైపోవడంతో, వారంతా చేతులు పైకెత్తి సునాక్‌కు మద్దతు పలికారు. ఒపీనియన్ పోల్స్‌లో చాలా వరకు లిజ్ ట్రస్ వైపు మొగ్గుచూపుతుండగా.. చానల్ స్టూడియోలో ప్రేక్షకులు రిషి సునాక్‌కు ఓటేయడం బ్రిటన్ రాజకీయ వర్గాలను కూడా విస్మయానికి గురిచేసింది.