Egypt: చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి..
Egypt: ఈజిప్ట్ రాజధాని కైరో కాప్టిక్ చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.;
Egypt: ఈజిప్ట్ రాజధాని కైరో కాప్టిక్ చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 41 మంది చనిపోయారు. మరో 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఇంబాబాలోని అబూ సెఫీన్ చర్చిలో ఆదివారం ఉదయం ప్రార్థనలు జరుగుతుండగా.. ఒక్కసరిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి 15 ఫైర్ ఇంజిన్లను తరలించి, మంటలను ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఘటనపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాఫ్ LCC సంతాపం ప్రకటించారు.