Omicron: అమెరికాలో నమోదైన తొలి ఒమిక్రాన్ మరణం..
Omicron: అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. టెక్సస్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఒమిక్రాన్‌తో మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించారు.;
Omicron: అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. టెక్సస్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఒమిక్రాన్‌తో మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే మృతుడు ఎలాంటి టీకాలు తీసుకోలేదని.. దీంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ మృతికి కారణం అయ్యి ఉండొచ్చని అధికారులు అంటున్నారు.
ఇదిలా ఉంటే అమెరికాలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో.. ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉండటం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. గత వారంలో నమోదైన మొత్తం కేసుల్లో 73శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయి. బిజినెస్ క్యాపిటల్ న్యూయార్క్‌లో నమోదువుతున్న కేసుల్లో 90శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయి.