NeoCoV: కరోనా కొత్త వేరియంట్ నియోకోవ్.. ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతారని హెచ్చరికలు..
NeoCoV: కరోనా కొత్త వేరియంట్‌పై చైనా సరికొత్త హెచ్చరికలు జారీ చేసింది.;
NeoCoV: కరోనా కొత్త వేరియంట్‌పై చైనా సరికొత్త హెచ్చరికలు జారీ చేసింది. నియోకోవ్ పేరుతో మోస్ట్ డేంజరస్ కరోనా వేరియంట్ రాబోతోందంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇదిగాని సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోవడం ఖాయం అని సీరియస్‌గానే హెచ్చరించింది. ఒమిక్రాన్‌కు ప్రపంచం మొత్తం భయపడినప్పటికీ.. మరణాలు మాత్రం పెద్దగా నమోదవలేదు. కాని, రాబోయే నియోకోవ్ వైరస్ మాత్రం అత్యంత ప్రమాదికారి అని స్వయంగా చైనాలోని వూహాన్ ల్యాబ్ సైంటిస్టులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.
నియో కోవ్ వైరస్ భిన్నమైనది, అత్యంత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ శరీరంలోని యాంటీబాడీలు, వ్యాక్సిన్లను సైతం తట్టుకుని నిలబడగలదని చెబుతున్నారు. డోసులు, బూస్టర్ డోసులేం పనిచేయకపోవచ్చని గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. 2012, 2015లో మెర్స్ - కోవ్ కారణంగా వందల మంది చనిపోయారు. ఈ నియోకోవ్‌తోనూ అదే స్థాయిలో మరణాలు ఉండొచ్చని హెచ్చరించారు.
విచిత్రంగా నియోకోవ్ కూడా దక్షిణాఫ్రికాలోనే పుట్టుకొచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ కూడా దక్షిణాఫ్రికా నుంచే ప్రపంచం మొత్తానికి పాకింది. కొత్తగా పుట్టుకొచ్చిన నియోకోవ్‌కు.. ఒమిక్రాన్ లక్షణాలే ఉన్నాయి. అంటే, అత్యంత వేగంగా వ్యాపించగల లక్షణం ఉంటుందని, కాకపోతే ఒమిక్రాన్ అంత సాఫ్ట్ వైరస్ మాత్రం కాదని హెచ్చరిస్తున్నారు. నియోకోవ్ వైరస్ కారణంగా మరణాల రేటు అధికంగా ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
నియోకోవ్ వైరస్ దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో కనిపించిందని.. వూహాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది కూడా కరోనా వైరస్ వేరియంటేనని చైనా శాస్త్రవేత్తలు నిర్దారించారు. ఈ విషయాన్ని రష్యా అధికారిక మీడియా స్పుత్నిక్ బయటపెట్టింది. ప్రస్తుతం ఈ కొత్త వైరస్ జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతుందని చెబుతున్నారు. కాకపోతే, ఈ వైరస్‌లో జరిగే మ్యుటేషన్ కారణంగా జంతువుల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని సైంటిస్టుల రీసెర్చ్‌లో తేలింది.
గబ్బిలాల్లో నియోకోవ్ వైరస్ ఉన్నప్పటికీ.. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ కారణంగా అవి తట్టుకోగలుగుతున్నాయి. కాని, మనుషుల్లోని ఈ ఎంజైమ్‌ను మాత్రం నియోకోవ్ వైరస్ ఏమార్చి, మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుందని వూహాన్ యూనివర్సిటీ, బయోఫిజిక్స్ ఆఫ్ ది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తానికి గబ్బిలాలు, జంతువుల్లో కనిపిస్తున్న నియోకోవ్ వైరస్.. మనుషులకు రాకూడదు అని కోరుకోవడం మినహా ప్రస్తుతానికి చేయగలిగిందేం లేదు. మనుషులకు గనక వ్యాపిస్తే.. ఊహించని ప్రాణనష్టం జరగొచ్చని హెచ్చరిస్తున్నారు.