Britain Elections : రిషి కన్నా ఓ అడుగుముందున్న లిజి..

Britain Elections : బ్రిటన్ ప్రధానమంత్రి ఎన్నికల్లో రిషి సునాక్, లిజి ట్రస్ నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతున్నారు

Update: 2022-07-27 14:30 GMT

Britain Elections : బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం మాజీ చాన్సలర్‌ రిషి సునాక్, విదేశాంగ మంత్రి లిజి ట్రస్ నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్ హోరాహోరీగా జరిగింది. ప్రధానంగా ఇరు నేతల మధ్య పన్ను ప్రణాళిక, ఆర్థిక అంశాలపై చర్చలు జరిగాయి. ఒపీనియం సంస్థ నిర్వహించిన పోల్‌లో రిషికి 39 శాతం ఓట్లు వస్తే.. లిజికి 38 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, ఈ సర్వేలో పాల్గొన్న కన్జర్వేటివ్‌ పార్టీ ఓటర్లలో మాత్రం 47 శాతం మంది లిజి బాగా మాట్లాడారని చెబితే.. 38 శాతం మంది రిషికి మద్దతు పలికారు.

డిబేట్‌లో భాగంగా "40 బిలియన్‌ పౌండ్ల మేర పన్నుల కోతకు లిజి హామీ ఇచ్చారు. అదనంగా 40 బిలియన్‌ పౌండ్ల అప్పులు తేవడానికైన సిద్దమన్నారు. అయితే ఆ అప్పులు భవిష్యత్‌తరాలకు భారం అవుతాయని లిజిపై రిషి విమర్శలు గుప్పించారు. అలాగే లిజి ప్రతిపాదిస్తున్న ట్యాక్స్ కోతల వల్ల లక్షల మంది ఇబ్బందిపడతారని, వచ్చే సాధారణ ఎన్నికల్లో దీనికి కన్జర్వేటివ్‌ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అయితే "రిషి ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 70 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా భారీగా పన్నులను పెంచారు. ఇప్పుడు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. నిజాలెంటో గణాంకాలే చెబుతున్నాయని లిజి మండిపడ్డారు.

Tags:    

Similar News