Russia: యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చిన రష్యా..

Russia: ఉక్రెయిన్‌లోని కీలక నగరాలైన మరియుపోల్, వోల్నావఖాలో కాల్పుల విరమణ ప్రకటించింది.

Update: 2022-03-05 07:22 GMT

Russia: యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించింది రష్యా. ఉక్రెయిన్‌లోని కీలక నగరాలైన మరియుపోల్, వోల్నావఖాలో కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ నగరాల్లోని పౌరులు వెంటనే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అల్టిమేట్టం ఇచ్చింది. ఉక్రెయిన్‌ కాలమానం ప్రకారం ఉదయం పదకొండున్నర నుంచి ఐదున్నర గంటల పాటు ఈ తాత్కాలిక విరామం ప్రకటించింది.

యుద్ధ రంగంలో చిక్కుకున్న పౌరులను తరలించేందుకు వీలుగా.. కాల్పుల విరమణ ప్రకటించాలని రష్యాను భారత్ ప్రత్యేకంగా కోరింది. భారత్‌ విజ్ఞప్తి చేసిన గంటల్లోనే రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. మరోవైపు ప్రపంచ దేశాలు కూడా రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చాయి.

పౌరులు, విదేశీయులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే వరకు కాల్పుల విరమణ ప్రకటించాలని కోరాయి. అయితే, కేవలం రెండు నగరాల్లో మాత్రమే తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. ఐదున్నర గంటల విరామం తరువాత మరియుపోల్, వోల్నావఖా నగరాలపై రష్యా విరుచుకుపడబోతోందన్న సంకేతాలు వస్తున్నాయి. 

Tags:    

Similar News