Russia: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు.. 23 మంది మృతి..
Russia: ఉక్రెయిన్‌లో రష్యా మళ్లీ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. వినిట్సియా నగరంపై రష్యా క్షిపణుల దాడులు చేసింది.;
Russia: ఉక్రెయిన్‌లో రష్యా మళ్లీ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. వినిట్సియా నగరంపై రష్యా క్షిపణుల దాడులు చేసింది. ఈ క్షిపణి దాడుల్లో 23 మంది మృతి చెందగా.. వంద మందికి గాయాలయ్యాయి. మరోవైపు ఉక్రెయిన్‌పై దురాక్రమణపై దిగడంతో ఈయూ దేశాలు ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించాయి. అయినా రష్యా తన దూకుడు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ స్వాధీనమే లక్ష్యంగా దాడులను వేగవంతం చేసింది. దాంతో రష్యాను అడ్డుకునేందుకు ఈయూ దేశాలు మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి. బంగారం, క్రూడాయిల్ సహా రష్యా ఎగమతులన్నింటిపైనా మరిన్ని ఆంక్షలు విధిస్తామని ఈయూ కమిషన్ అధికారి తెలిపారు.