రూరల్ బ్యాంకుల్లో 102 అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్-ఏ) పోస్టులకు నాబార్డ్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రెండు దశల్లో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలుంటాయి. ఫేజ్-1 ఎగ్జామ్ సెప్టెంబర్ 1న జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 15 వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య సమాచారం :
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, కోర్సు సర్టిఫికేట్, పీజీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు: క్రెడిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్ఎంఈ, రిస్క్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
గరిష్ఠ వయోపరిమితి: డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 40 ఏళ్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 38 ఏళ్లు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 14, 2024