ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి విద్యార్థులకు కీలక ప్రకటన జారీ చేసింది. ఏపీ ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం, బీఈడీ, వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
తాజా షెడ్యూల్ ప్రకారం...బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 9 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ: సెప్టెంబర్ 9 నుంచి 12
ధ్రువపత్రాల పరిశీలన:సెప్టెంబర్ 10 నుంచి 13
వెబ్ ఆప్షన్స్ నమోదు:సెప్టెంబర్ 13 నుంచి 15
వెబ్ ఆప్షన్స్ మార్పు: సెప్టెంబర్ 16.
మొదటి విడత సీట్ల కేటాయింపు: సెప్టెంబర్ 18.
కళాశాలల్లో చేరడం:సెప్టెంబర్ 19, 20
అదేవిధంగా వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం పీఈసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుంది.
రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 10 నుంచి 13
ధ్రువపత్రాల పరిశీలన: సెప్టెంబర్ 11 నుంచి 14
వెబ్ ఆప్షన్స్ నమోదు: సెప్టెంబర్ 14 నుంచి 16
వెబ్ ఆప్షన్స్ మార్పు: సెప్టెంబర్ 17.
సీట్ల కేటాయింపు: సెప్టెంబర్ 19.
కళాశాలల్లో చేరడం: సెప్టెంబర్ 22, 23
ఈ షెడ్యూల్‌ను అనుసరించి విద్యార్థులు తమ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఉన్నత విద్యామండలి సూచించింది.