AP : బీ-ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్

Update: 2024-11-28 08:15 GMT

ఎంపీసీ, బైపీసీ విభాగాల్లోని బీ-ఫార్మసీ సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపీసీ స్టూడెంట్స్ రేపు, ఎల్లుండి ఫీజు చెల్లించవచ్చు. ఆప్షన్స్ నమోదుకు డిసెంబర్ 1 వరకు ఛాన్స్ ఉంటుంది. 5వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. బైపీసీ విద్యార్థులు ఈ నెల 30 నుంచి డిసెంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 3 నుంచి 7 వరకు ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. 12వ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయి.

డీఎస్సీకి ప్రిపేరవుతున్న మైనార్టీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఫరూఖ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో ఈ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. దీని కోసం అభ్యర్థులు www.apcedmmwd.org వెబ్‌సైట్ లేదా మెనార్టీ డైరెక్టర్ కార్యాలయంలో అప్లై చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 0866-2970567 నంబర్‌కు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Tags:    

Similar News