BHEL: బీటెక్ అర్హతతో 'బెల్'లో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు ఆగస్టు 15..
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఉద్యోగ ప్రకటనను వెలువరించింది.;
BHEL: సంస్థ బెంగళూరు యూనిట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన 51 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీరింగ్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 511
ట్రెయినీ ఇంజనీర్లు: 308
ప్రాజెక్ట్ ఇంజనీర్లు: 203
దివ్యాంగులకు 4% రిజర్వేషన్ ఉంటుంది. ట్రెయినీ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 25 ఏళ్లు. ప్రాజెక్ట్ ఇంజనీర్ అభ్యర్ధులకు 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు వయ:పరిమితిలో ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు మినహాయింపు ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ పాసై ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రెండేళ్ల అనుభవం అవసరం. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్ధులను ఇంజనీరింగ్‌లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా, పని అనుభవాన్ని బట్టి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ కోసం ఎంపిక చేసిన అభ్యర్ధుల జాబితాను బెల్ వెబ్‌సైట్‌లో పెడతారు.
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు రూ.500లు
ట్రెయినీ ఇంజనీర్ దరఖాస్తుకు రూ.200
ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్ ఇంజినీరింగ్ డిగ్రీ పాసై ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రెండేళ్ల అనుభవం అవసరం. ఆన్‌లైన్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను బీఈ/ బీటెక్‌లో సాధించిన మెరిట్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ కోసం ఎంపికచేసిన అభ్యర్థుల జాబితాను బెల్ వెబ్‌సైట్‌లో పెడతారు. వీరికి వీడియో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను బెల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ట్రెయినీ ఇంజినీర్‌కు దరఖాస్తు ఫీజు రూ.200. ఫీజును ఎస్‌బీఐ చలాను లేదా ఎస్‌బీఐ కలెక్ట్ లింక్ ద్వారా చెల్లించవచ్చు.
ఎంపికైన ట్రెయినీ ఇంజనీర్లను ఏడాది కాలానికి విధుల్లోకి తీసుకుంటారు. ప్రాజెక్ట్ అవసరం, వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఈ కాలాన్ని మూడు నుంచి నాలుగేళ్ల వరకు పెంచవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ : 2021 ఆగస్టు 15