Capgemini : క్యాప్‌జెమినీ ఉద్యోగులకు శుభవార్త

Update: 2024-09-19 13:45 GMT

దేశీయ కంపెనీలు సైతం తమ టాలెంట్ పూల్ కొనసాగేలా చూసుకునేందుకు వేతన పెంపులు, అధిక వేతన ప్యాకేజీలు, వేరియబుల్ పే పెంపులు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ కేంద్రంగా భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్ దిగ్గజం క్యాప్ జెమినీ తన 1.7 లక్షల మంది ఉద్యోగులకు పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తోంది. టెక్ దిగ్గజం తన ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

ప్రస్తుత కాలంలో స్టార్టప్ కంపెనీలు ఎక్కువగా తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ ప్లాన్లను అందిస్తున్నాయి. దీనికి తోడు చాలా తక్కువ సంఖ్యలో ఐటీ కంపెనీలు ఇలాంటి ప్రోత్సాహకాలను ఉద్యోగులకు అందించటంతో వారిని సైతం కంపెనీలో వాటాదారులుగా మారుస్తున్నాయి. ఉద్యోగులతో కంపెనీ తన సంబంధాలను మెరుగుపరుచుకోవటంతో పాటు వారి పనితీరును ప్రోత్సహించేదిగా దీనిని కంపెనీలు వినియోగిస్తున్నాయి. ఇదే తరహాలో క్యాప్ జెమినీ కూడా ఒక అడుగు ముందుకేసి ఉద్యోగులందరికీ తన 11వ ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రపంచానికి ఐటీ సేవలను ఎగుమతి చేసే అగ్రగామి కంపెనీల జాబితాలో ఇండియా స్థానం ఇప్పటికీ సుస్థిరంగానే ఉంది. కంపెనీలు సైతం తమ ఉద్యోగులను రివార్డ్ చేసేందుకు సరికొత్త పద్ధతులతో ముందుకు రావటంపై టెక్కీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ తమకు మంచి రోజులు తిరిగి వచ్చాయని వారు భావిస్తున్నారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా బెంగళూరుకు పేరుంది. హైదరాబాద్ కూడా బెంగళూరుతో పోటీ పడుతోంది.

Tags:    

Similar News