Good News : కర్ణాటక ఉద్యోగులకు కాంగ్రెస్ గుడ్ న్యూస్.. 3.5 శాతం డీఏ పెంపు

Update: 2024-03-13 08:44 GMT

తెలంగాణలో (Telangana) ఉద్యోగుల డీఏ పెంచుతామని ఇటీవలే రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు. అటు కర్ణాటకలోనూ ఎన్నికల టైంలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ - డీఏ ను 3.75 శాతం పెంచుతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీంతో.. 42.5 శాతానికి డీఏ పెంచినట్టయింది.

కేంద్ర వేతన స్కేల్ ఉన్న ఉద్యోగులకు, ప్రస్తుతం ఉన్న 46 శాతం నుండి 50 శాతానికి పెంచినట్లు కర్ణాటక సిఎం సిద్దరామయ్య తెలిపారు. కేంద్ర వేతన స్కేలుపై ఉన్నవారికి ఇది 46 శాతం నుంచి 50 శాతానికి పెరిగింది. నెలవారీ పెన్షన్ మొత్తాన్ని తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులందరికీ కొత్త పెంపు వర్తిస్తుంది. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ. 1792.71 కోట్ల భారం పడనుంది.

గత ఏడాది అక్టోబరులో ప్రభుత్వం కరువు భత్యాన్ని 35 శాతం నుంచి 38.75 శాతానికి సవరించింది. యూజీసీ, ఏఐసీటీఈ, ఐసీఏఆర్ స్కేల్ పై లెక్చరర్లు, జ్యుడీషియల్ ఆఫీసర్లకు (సెంట్రల్ పే స్కేల్) నాలుగు శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News