తమిళ హీరో సూర్య నటిస్తున్న కొత్త సినిమా కంగువా. పాన్ ఇండియా లెవల్లో దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన కంగువా ట్రైలర్ కి ఆడియన్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దాంతో సూర్య ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కు కంగువా వచ్చే అవకాశం కనిపించడంలేదు. కారణం అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న వెట్టయ్యాన్ రిలీజ్ కానుంది. దాంతో తప్పనిసరి పరిస్థితులలో కంగువా సినిమాను నవంబర్ 14కు వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.