JD Lakshmi Narayana : వాళ్లు చంపేస్తారు..! నీట్ లీక్ పై జేడీ లక్ష్మీ నారాయణ ట్వీట్ పై చర్చ
ఒక దేశాన్ని నాశనం చేయాలంటే... ఆటం బాంబులు అవసరం లేదు. నాసిరకం విద్య, విద్యార్థులను పరీక్షల్లో కాపీ కొట్టిన వైద్యుల చేతిలో రోగులు చనిపోతారు... అని మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది.
దీనిపై పలు ఉదాహరణలను ఒక యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద రాశారని ఆయన పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జేడీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.