Software Developers : సాప్ట్ వేర్ డెవలపర్లకు ఫుల్ గిరాకీ

Update: 2024-08-09 09:45 GMT

ఐటీ సంస్థలు మాంద్యం ప్రభావం నుంచి క్రమంగా పుంజుకుంటున్నాయి. తమ అవసరాలకు అను గుణంగా కొత్త నియామకాల ప్రక్రియ వేగవంతం చేస్తున్నాయి. వచ్చే ఏడాది లోపు 8.5 శాతం ఐటీ కొలువుల నియామకాలు పెరుగుతాయని గ్లోబల్ జాబ్ మ్యాచింగ్ అండ్ ప్లాట్ ఫామ్ ' రిక్రూట్ హోల్డింగ్స్' అనుబంధ సంస్థ ఇండీడ్ ఇండియా పేర్కొంది.

ఐటీ కంపెనీల్లో 70 శాతం సాఫ్ట్ వేర్ రోల్స్ నిర్వహణకు అవసరం అని ఆ నివేదిక సారాంశం. సరికొత్తగా దూసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ టూల్స్ అడాప్షన్ వైపు శరవేగంగా దూసుకెళ్తున్నాయి. స్పెషలైజ్డ్ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ కు ప్రాధాన్యం పెరుగుతోందని ఇండీడ్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న సాఫ్ట్ వేర్ టూల్స్ లో కొత్త ఫీచర్లు, టెక్నాల జికల్ అడ్వాన్స్మెంట్స్ కోసం వృత్తి నిపుణులకు డిమాండ్ నికరంగా కొనసాగుతోంది.

'అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్, పీహెచ్పీ డెవలపర్ల్ నియామకాలు ఐటీ కంపెనీలు చురుగ్గా సాగిస్తున్నాయి. వీటిపాటు నెట్ డెవలపర్లు, సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్స్, డెవ్ ఆప్స్ ఇంజినీర్లు, డేటా ఇంజినీర్లు, ఫ్రంట్ ఎండ్ డెవల పర్లకూ గిరాకీ పెరుగుతోంది. ఐటీ రంగం నిరంతరం భారీ ఉద్యోగాల కల్పనకు పవర్ హౌజ్. కానీ ఇటీవలి మాంద్యం ప్రభావంతో నియామకాలు తగ్గాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఆచితూచి స్పందిస్తున్నాయి.

Tags:    

Similar News