నోటిఫికేషన్ల కోసం ఉద్యోగులు ఏళ్లకేళ్లు వేచిచూసే అవసరం లేకుండా జాబ్ క్యాలెండర్ ఏటేటా రిలీజ్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు, విద్యార్థుల నిరసన తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరో వారంలో ఈ ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసే పనిలో ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాలవ్యవధితో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఇకపై ఏటా జనవరి 1వ తేదీన టీజీపీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డుల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్లు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. టీజీపీయస్సీ గ్రూప్-1, 2, 3, 4లతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలను ప్రకటనలు వెలువరించడం వల్ల నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో భుత్వం ఉద్యోగ పదవీ విరమణ వయసును మూడేళ్లు పెంచడంతో రిటైర్మెంట్లు ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్ క్యాలెండర్ ను సిద్ధం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ లెక్కలు తీశారు. రెవెన్యూ శాఖలో వీఆర్వో, వీఆర్వో పోస్టులను తొలగించడంతో ఇకపై గ్రామానికి ఒక రెవెన్యూ అధి కారి ఉండేలా సర్కార్ యోచిస్తోంది. దీంతో మరిన్ని కొత్త పోస్టుల క్రియేషన్ జరగనుంది. ఏటేటా రిటైర్మెంట్లు అవుతున్న కొద్దీ వెంటనే అవసరాల మేరకు పదో న్నతులు ఇస్తూ డైరెక్టరిక్రూట్ మెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనుంది.