TG Job Mela : అంబర్‌పేటలో 26న జాబ్‌మేళా

Update: 2024-10-25 11:15 GMT

నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ నెల 26వ తేదీన యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ షేక్‌ ఆజ్వాక్‌ తెలిపారు. అంబర్‌పేట ప్రేంనగర్‌ గ్రీన్‌ల్యాండ్‌ చౌరస్తాలో గల కమ్యూనిటీహాల్‌లో ఈ మేళా ఉంటుందన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18 సంవత్సరాలు నిండిన వారందరు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇందులో జాబ్‌ పొందిన వారికి రూ.15వేల నుంచి రూ.25వేల వరకు జీతాలు ఉంటాయన్నారు. మరన్ని వివరాలకు సెల్‌ :7386347792, 7842853053లో సంప్రదించాలని సూచించారు.

Tags:    

Similar News