Post Office Recruitment 2022: 8వ తరగతి ఉత్తీర్ణతతో పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో ఉద్యోగాలు.. జీతం రూ. 19,900

Post Office Recruitment 2022: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారీ వాహనాలు నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.;

Update: 2022-03-30 04:45 GMT

Post Office Recruitment 2022: డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, ముంబై, మహారాష్ట్ర, indiapost.gov.in లో జనరల్ సర్వీస్ గ్రూప్ సి నాన్-గెజిటెటెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్టుల భర్తీకోసం అర్హులైన అభ్యర్ధులనుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 9 మే 2022 సాయంత్రం 5 గంటల వరకు.

మొత్తం 9 ఖాళీలు

మెకానిక్ - 5

ఎలక్ట్రీషియన్ - 2

టైర్మాన్ - 1

కమ్మరి - 1

జీతం వివరాలు

వేతన స్కేల్: రూ. 19,900 – 7 వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో లెవెల్-2.

అర్హతలు

ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సాంకేతిక సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్ లేదా సంబంధిత ట్రేడ్‌లో ఒక సంవత్సరం అనుభవంతో 8వ తరగతి ఉత్తీర్ణత. మెకానిక్ (మోటార్ వెహికల్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారీ వాహనాలు నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయో పరిమితి

01.07.2022 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ

కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా అవసరమైన అర్హతలు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్దేశిత ఫార్మాట్‌లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను 9 మే 2022లోగా పంపాలి. పోస్టల్ అడ్రస్ "The Senior Manager (JAG), Mail Motor Service, 134-A, Sudam Kalu Ahire Marg, Worli, Mumbai- 400018"కు దరఖాస్తును పంపవచ్చు. 

Tags:    

Similar News