సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం నీట్ యూజీ 2024 ఫలితాలను ప్రకటించింది. పరీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలను వెల్లడించాలని సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో సుప్రీం తీర్పునిస్తూ.. పరీక్ష కేంద్రాల వారీగా మార్కులను వెల్లడించాలని ఎన్టీఏకు సుప్రీం ఆదేశించింది. ప్రతి సెంటర్, ప్రతి నగరానికి చెందిన ఫలితాలను రిజల్ట్స్‌ను డిక్లేర్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారమే ఇవాళ ఎన్టీయే ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో రిలీజ్ చేసింది.