రైల్వేలో 8,113(గూడ్స్ ట్రైన్ మేనేజర్-3144, టికెట్ సూపర్ వైజర్-1736, టైపిస్ట్-1507, స్టేషన్ మాస్టర్-994, సీనియర్ క్లర్క్-732) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్లలోపు వారు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు అప్లై చేయవచ్చు. అక్టోబర్ 16-25 మధ్య దరఖాస్తుల సవరణకు ఛాన్సుంది. SCRలో 478, ECoRలో 758 పోస్టులున్నాయి. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మహిళా అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష లెవల్-1 ఉంటుంది. రెండో దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2ను నిర్వహిస్తారు. అనంతరం సిల్క్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థుల జీతం నెలకు రూ.29,900 ఉంటుందని నోటిఫికేషన్‌లో ఆర్ఆర్‌బీ స్పష్టంచేసింది.