యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్ పర్సన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి, యూపీఎస్సీ సభ్యురాలు ప్రీతి సుడాన్ నియమితులయ్యారు. ఆమె 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన మాజీ అధికారిణి.
ప్రీతీ సుడాన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ గా పనిచేశారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలోనూ ఆమె విశేషమైన సర్వీర్ చేశారు. ఆమె కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా పని చేసి ప్రముఖుల ప్రశంసలు దక్కించుకున్నారు.