SBI Notification : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 13735 క్లర్క్ పోస్టుల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు ప్రారంభం కాగా, వచ్చే ఏడాది జనవరి 7న ముగుస్తుంది. ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో, మెయిన్ పరీక్ష మార్చి/ ఏప్రిల్‌లో జరగనుంది. జనరల్/ OBC/ EWS కేటగిరీ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
SBI 13, 735 జూనియర్ అసోసియేట్ జాబ్స్ :
పోస్టుల సంఖ్య : క్లర్క్ (జూనియర్ అసోసియేట్) – 13,735 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ – 50, తెలంగాణ – 342)
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
దరఖాస్తు గడువు : 2024 డిసెంబర్ 17 నుంచి 2025 జనవరి 7 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : 20 – 28 ఏళ్ళ మద్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు ఉంటుంది)
ఎంపిక విధానం : ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, స్థానిక భాష మీద టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ: ప్రాథమిక సమాచారం ప్రకారం 2025 ఫిబ్రవరి నెలలో ఉండొచ్చు. ఖచ్చితమైన తేదీలు త్వరలో ప్రకటిస్తారు.
మెయిన్ ఎగ్జామ్ తేదీ: ప్రాథమిక సమాచారం ప్రకారం 2025 మార్చి/ఏప్రిల్ నెలలో ఉండొచ్చు. ఖచ్చితమైన తేదీలు త్వరలో ప్రకటిస్తారు.