Telangana Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. 5 నిమిషాలు లేటైనా అనుమతి

Update: 2024-05-23 04:46 GMT

తెలంగాణలో రేపటి నుంచి అంటే మే 24 నుంచి జూన్ 3 వరకు జరగనున్న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం 900 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం.12 వరకు ఫస్టియర్, మధ్యాహ్నం.2:30 నుంచి సాయంత్రం .5:30 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

ప్రథమ సంవత్సరం విద్యార్థులు 3,240 పరీక్షలకు హాజ రుకానున్నట్లు తెలిపారు. ఇందులో జనరల్‌ విద్యార్థులు 3,293 మంది, ఒకేషనల్‌ 127 మంది ఉన్నా రు. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2,451మంది హాజరుకానున్నారు. ఇందులో జనరల్‌ విద్యార్థులు 2,229 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 222 మంది ఉన్నారు. .

పరీక్షల నిర్వహణ కోసం 14 మంది సీఎస్‌, 14 మంది డీవోలు, ఒక ఫ్లయింగ్‌, ఒక సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమించినట్లు వివరించారు. ప్రశ్నపత్రాల కోసం ఏడు స్టోరేజ్‌ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళవారం ఆర్‌ఐవో కార్యాలయంలో సీఎస్‌, డీవోల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News