టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం ..!
GHMC, వాటర్ వర్క్స్ శాఖల్లో అవినీతిని అరికట్టి.. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.;
GHMC, వాటర్ వర్క్స్ శాఖల్లో అవినీతిని అరికట్టి.. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ బర్కత్‌పురాలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని.. GHMC ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా.. డివిజన్ల అభివృద్ధికి నిధులు విడుదల చేయలేదన్నారు. నిధులు లేక కార్పొరేటర్లు అవస్థలు పడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.