UP Paper Leak : యూపీలో పేపర్‌ లీక్‌.. ప్రధాన నిందితుడు అరెస్ట్

Update: 2024-03-02 06:51 GMT

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ బోర్డు 12వ తరగతి పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 12వ తరగతి బోర్డు పరీక్షకు సంబంధించిన గణితం, జీవశాస్త్ర ప్రశ్న పత్రాలు పరీక్షలు ప్రారంభమైన గంట తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయబడ్డాయి. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగ్రా జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డియోస్) దినేష్ కుమార్ ఫిర్యాదు మేరకు ఫతేపూర్ సిక్రీలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు వినయ్ ఇంటర్మీడియట్ బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ల ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపులో సర్క్యులేట్ చేశాడని పోలీసులు తెలిపారు. ఆగ్రాలోని శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ వినయ్ చౌదరి 12వ తరగతి బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ ఫొటోలను ‘ఆల్ ప్రిన్సిపల్స్ ఆగ్రా’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో షేర్‌ చేశాడు. మరోవైపు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం పేపర్ లీక్ అయిన ఆగ్రాలోని సదరు కళాశాల గుర్తింపును రద్దు చేశారు. యూపీ బోర్డు సమావేశంలో శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజ్ రోజౌలీ గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించారు.

Tags:    

Similar News