UPSC IFS : యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ ఫలితాలు విడుదల

Update: 2025-05-21 06:30 GMT

యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) 2024 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కనికా అనభ్ టాప్లో నిలవగా.. పలువురు తెలుగు అభ్యర్థులు ఈ పరీక్షల్లో మెరిశారు. తెలంగాణ నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన మిర్యాలగూడ వాసి చాడా నిఖిల్ రెడ్డి 11వ ర్యాంకు, యెడుగూరి ఐశ్వరా రెడ్డి 13, చేరూరి అవినాష్ రెడ్డి 40, చింతకాయల లవకుమార్ 49, అట్ల తరుణ్ తేజ 53, ఆలపాటి గోపీనాథ్ 55వ ర్యాంకు సాధించారు. మొత్తం 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. గతేడాది జూన్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 1, 2024 వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగాయి. అందులో సెలెక్ట్ వారికి ఏప్రిల్ 21 నుంచి మే 2, 2025 వరకు పర్సనాలిటీ టెస్టులు నిర్వహించారు. . తాజాగా తుది ఫలితాలను ప్రకటించారు. వివిధ కేటగిరీల్లో మొత్తంగా 143 మందిని ఈ పోస్టులకు ఎంపిక చేశారు.వీరిలో 40 మంది జనరల్ కేటగిరీ, 19 ఈడబ్ల్యూఎస్, 50 ఓబీసీ, 23 ఎస్సీ, 11 ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు. పీడబ్ల్యూడీ వ్యక్తుల కోసం రిజర్వ్ చేయబడిన రెండు ఖాళీలకు ఎవరూ అర్హత సాధించలేదు. దీంతో ఆరెండు స్థానాలకు వచ్చే ఏడాదికి మార్చారు.

Tags:    

Similar News