దేశంలో ఏటా దాదాపు 10 లక్షల మంది ఇంజినీర్లు బయటకు వస్తున్నారు. వీరికి జాబ్స్ దొరకడం కష్టమవుతోంది. ప్రస్తుతం CS& AI బ్రాంచీకి మంచి డిమాండ్ ఉంది. సాఫ్ట్‌వేర్, డేటాసైన్స్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ రంగాల్లోకి వెళ్లాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ECE కూడా బాగుంటుంది. వీరికి చిప్ డిజైనింగ్, రోబోటిక్స్, సెమీకండక్టర్ పరిశ్రమలో అవకాశాలు లభిస్తాయి. మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ తీసుకుంటే ఆటోమొబైల్, ఏరోస్పేస్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో అవకాశాలు అందుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తీసుకుంటే రెన్యువబుల్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, రోబోటిక్స్ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. CE తీసుకుంటే స్మార్ట్ సిటీస్, హైవేస్, గ్రీన్ బిల్డింగ్స్ వాటిలో అవకాశాలు అందుకోవచ్చు. ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, మీకు ఏది బాగా సరిపోతుందో ఆలోచించండి. ఏ బ్రాంచ్ అయినా, మీరు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ లక్ష్యం ఏంటో, మీరు ఏ రంగంలో పనిచేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి.