తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్సేనని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని అంతా ఆశించారని.. అయితే దశాబ్ధకాలంగా నిరుద్యోగులు దగా పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ది సాధ్యమన్న భట్టి.. రేపు జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు.
సీఎం కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చేతిలో నిరుద్యోగులు మోస పోయారని.. గత తొమ్మిదేళ్లుగా నిరుద్యోగులకు కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో పేపర్ లీక్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక యువత, నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ప్రియాంక గాంధీ హైదరాబాద్ వస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే నెరవేర్చి తీరుతుందన్నారు.