కన్నకొడుకు మృతదేహం కోసం విశాఖలో వృద్ధ దంపతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. విశాఖకు చెందిన విద్యాసాగర్ ఉపాధి కోసం.. గత ఏడాది డిసెంబర్ 8న గల్ఫ్ వెళ్లాడు.గాజువాకకు చెందిన శ్రీహరి అనే బ్రోకర్ ద్వారా రియాద్లో AYTB కంపెనీలో చేరాడు. అయితే అనూహ్యంగా.. మూడు నెలలకే ఆతను చనిపోయినట్లు రియాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఎలా చనిపోయాడన్నది ఎవ్వరూ చెప్పలేదు. కంపెనీ సైతం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సహజ మరణమంటూ.. రియాద్ ఆసుపత్రి మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది. డెడ్ బాడీ వారం రోజుల్లో వస్తుందనుకున్నా.. 50 రోజులైనా రాకపోవడంతో.. కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పటికే... జిల్లా కలెక్టర్ కలిసి తమ గోడు వినిపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని.. విద్యాసాగర్ మృతి మిస్టరీ చేధించి.. మృతదేహాన్ని త్వరగా విశాఖకు రప్పించాలని కోరుతున్నారు.