ఆవుకు రిజర్వాయర్‌లో కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్

Update: 2023-05-14 12:06 GMT

నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో యువతి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక ఈ ప్రమాదం నుంచి 10మందిని సురక్షితంగా కాపాడారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కోవెలకుంట్ల పోలీస్ సర్కిల్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టెబుల్ గా పనిచేస్తున్న రసూల్ కుటుంబంగా తెలుస్తోంది. సెలవు కావడంతో.. సరదాగా బోటింగ్ షికారుకు వెళ్లారు.

అయితే బోటింగ్ చేస్తున్న సమయంలో.. ఒక్కసారిగా బోటు బోల్తాపడింది. ప్రమాద సమయంలో... రసూల్ కుటుంబానికి చెందిన 13మంది ఉన్నారు. బోటు అదుపు తప్పి నీటిలో మునిగిపోయింది. మరోవైపు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని డోన్ డీఎస్పీ శ్రీనివాస రెడ్డి అన్నారు. యువతి ఆచూకి కోసం ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దించామన్నారు. కానిస్టేబుల్ రసూల్ కుటుంబలో ఇద్దరు మృతి చెందడం బాధాకరమన్నారు. ఇక రెస్క్యూను వేగవంతం చేశామంటున్నారు.

Similar News