Breaking News : మెదక్ జిల్లా రేగోడ మండలం మర్పల్లిలో జరిగిన హోలీ సంబురాల్లో విషాదం చోటుచేసుకుంది. అంజయ్య అనే వ్యక్తి సరదాగా షబ్బీర్ అనే వ్యక్తిపై రంగులు చల్లాడు. షబ్బీర్ ఆగ్రహంతో రగిలిపోయి అంజయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంజయ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బాధితుడు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.