ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్
ఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తుంది. ప్రతీరోజు పదివేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి.;
ఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తుంది. ప్రతీరోజు పదివేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. సామన్యులే కాదు.. ప్రముఖులు కూడా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే అనేకమంది రాజకీయ నాయకులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు కరోనా సోకింది. గత రెండు రోజులుగా ఉండవల్లి జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచనలు పాటిస్తూ హోం ఐసోలేషన్ లో ఉన్నారు.