లైఫ్‌ సేవ్‌ ఎక్విప్‌మెంట్‌ ను ప్రభుత్వానికి విరాళంగా అందించిన డీజియో సంస్థ

కరోనా రోగులకు ఎమర్జెన్సీ సమయంలో వినియోగించే లైఫ్ సేవ్ ఎక్విప్‌మెంట్‌ హై ఫ్లో నాసల్ కెన్యులా (హెచ్ఎఫ్ఎన్సి) పరికరాలను

Update: 2020-08-27 10:41 GMT

కరోనా రోగులకు ఎమర్జెన్సీ సమయంలో వినియోగించే లైఫ్ సేవ్ ఎక్విప్‌మెంట్‌ హై ఫ్లో నాసల్ కెన్యులా (హెచ్ఎఫ్ఎన్సి) పరికరాలను బెంగళూరుకు చెందిన డీజియో సంస్థ రాష్ట్రానికి విరాళంగా అందజేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు వీటిని అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వీటిని అందజేసినట్లు సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రత్ మేశ్ మిశ్రా తెలిపారు. కోవిడ్ తీవ్రత వల్ల ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రోగులకు కాపాడేందుకు హై ఆక్పిజన్ అవసరమైన వారికి ఈ పరికరాలను వాడతారు. ఈ పరికరాన్ని గాంధీ, నిమ్స్, కింగ్ కోఠి, చెస్ట్, టిమ్స్ లో ఈ పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ముఖ్యమైన హాస్పిటల్స్ లోనూ వీటిని అమర్చుతామని టీఎస్‌ఎంసిఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

Tags:    

Similar News