టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రస్తుతం అనంతపురంలో కొనసాగుతున్న పాదయాత్ర ఇవాళ.. ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. మరికాసేపట్లో 61వ రోజు పాదయాత్ర ప్రారంభం కానుంది. పిల్లిగుండ్ల ఎంవైఆర్ కళ్యాణ మండపం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. 9గంటల 10నిమిషాలకు గొట్కూరులో స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. 9గంటల 50నిమిషాలకు మణిపాల్ స్కూల్ వద్ద గ్రామస్తులతో సమావేశమవుతారు. 10గంటల 5నిమిషాలకు బ్రాహ్మణపల్లి వద్ద యాదవ సామాజిక వర్గీయులతో భేటీ అవుతారు. 10గంటల 20నిమిషాలకు రామచంద్రపురం క్రాస్ వద్ద స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. 11గంటల 25నిమిషాలకు కమ్మూరులో భోజన విరామం తీసుకుంటారు. విరామ అనంతరం మధ్యాహ్నం రెండున్నరకు కమ్మూరు నుంచి పాదయాత్రను కొనసాగిస్తారు. సాయంత్రం కూడేరు బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటల 50నిమిషాలకు కూడేరు విడిది కేంద్రంలో బస చేస్తారు.