Hindi Paper Leak : అర్థరాత్రి బండి సంజయ్ అరెస్ట్

Update: 2023-04-05 03:25 GMT

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. టెన్త్‌ క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ ఘటనలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌లోని ఆయన నివాసంలోనే అరెస్ట్‌ చేస్తుండగా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంజయ్‌ అరెస్ట్‌ను కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు కార్యకర్తలను అదుపుచేసి.. బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అర్ధరాత్రి బండి సంజయ్‌ను తరలిస్తున్న పోలీసు వాహనం ఎల్‌ఎండీ సమీపంలో మొరాయించింది. దీంతో మరో వాహనంలో ఎక్కించారు. బండి సంజయ్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పీఎస్‌కు తరలించారు.

మరోవైపు బండి సంజయ్‌ అరెస్ట్‌ను బీజేపీ ఖండించింది. అటు యాదాద్రి జిల్లా బొమ్మలరామరం పీఎస్‌ వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. సంజయ్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ పీఎస్‌ ఎదుట బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

Tags:    

Similar News