TS : మార్చి 29న హైదరాబాద్ లో TDP బహిరంగ
రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం... బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు;
మార్చి 29న పెరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం... బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అబ్జర్వర్ల నియామకాలు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉంటాయన్నారు. టీటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు కోటిశ్వర్లు కాదని, కార్యకర్తలంతా పేదలో ఉంటారన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకు అన్యాయం జరగదంటున్నారు కాసాని జ్ఞానేశ్వర్.
కాసాని జ్ఞానేశ్వర్ తో తెలంగాణలో టీడీపీ ఆశలు చిగురిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఖమ్మంలో సభ పెట్టి విజయవంతం చేశారు కాసాని. రాష్ట్ర విభజన తర్వాత తెదేపా తిరిగి తెలంగాణలో యాక్టీవ్ గా పనిచేస్తుంది. ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో తేదేపా తన పునర్వైభవాన్ని తిరిగి పొందుతుందని కాసాని ఆశాభావం వ్యక్తం చేశారు.