పంజాబ్ జైళ్లశాఖ మంత్రికి కరోనా పాజిటివ్
పంజాబ్ కేబినెట్ మంత్రి సుఖ్జిందర్ సింగ్ రాంధవా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సీఎం అమరీందర్ ట్విట్టర్లో తెలిపారు.;
దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక పంజాబ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా మహమ్మారి ఎవరినీ వదలటం లేదు. తాజాగా పంజాబ్ కేబినెట్ మంత్రి సుఖ్జిందర్ సింగ్ రాంధవా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సీఎం అమరీందర్ సింగ్ ట్విట్టర్లో తెలిపారు. పంజాబ్ క్యాబినెట్ మంత్రుల్లో కరోనా బారినపడి మూడో వ్యక్తి రాంధవా. ఇంతకుముందు మంత్రులు తృప్తి రాజిందర్ సింగ్ బజ్వా, గురుప్రీత్ సింగ్ కాంగర్ వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు.