అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. అంజమ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజూమున భూ ప్రకంపనలు సంభవించాయి.;
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. అంజమ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజూమున భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదయ్యింది. సోమవారం తెల్లవారుజాయిన 3 గంటల 36 నిమిషాలకు చాంగ్లాంగ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో ఈ భూకంపం సంభవించినట్లు భూ కంప అధ్యయన కేంద్రం పేర్కొంది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనాలు ఇంటిలో నుంచి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు.